ఓటు పోయింది..

by  |
ఓటు పోయింది..
X

వ్యవసాయ పరపతి సహకార సంఘం ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధునికి ఊహించని షాక్ తగిలింది. ఆలస్యంగా వెళ్లడంతో తన ఓటును పోగొట్టుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. ఓటు పోగొట్టుకోవడం అంటే ఎక్కడో పారేసుకున్నాడని కాదు అతని ఓటును వేరే వ్యక్తి వినియోగించుకున్నాడని అర్థం. సూర్యాపేట మండలం ఇమాంపేటకు చెందిన రామచంద్రయ్య సహకార సంఘం ఎన్నికల్లో స్థానిక జెడ్పీపరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లగా అప్పటికే తనపేరుతో వేరే వ్యక్తి ఓటు వేశాడని తేలింది. దీంతో గందరగోళానికి లోనైన రామచంద్రయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.


Next Story