త్వరలో భారత మార్కెట్లోకి వోల్వో ఎలక్ట్రిక్ కార్

by Harish |
త్వరలో భారత మార్కెట్లోకి వోల్వో ఎలక్ట్రిక్ కార్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో (Volvo) భారత్‌లో వచ్చే ఏడాది వృద్ధి సాధించనున్నట్టు ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే, కంపెనీ ఉత్పత్తిని పెంచి, ఇటీవల వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రికల్ వాహనాల (Electrical vehicles) విభాగంలో ప్రవేశించేందుకు స్థానికంగా అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వోల్వో కార్ల అమ్మకాలు జులైతో పోలిస్తే ఆగష్టులో మెరుగుపడిందని, పండుగ సీజన్ మరింత మెరుగ్గా ఉండొచ్చని కంపెనీ భావిస్తోంది.

ఇప్పటికే వోల్వో కార్ ఇండియా (Volvo Car India) తన మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ (Compact SUV) ని వచ్చే ఏడాది భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ‘2021 తమకు మంచి వృద్ధి అవనుంది. ఇప్పటికే 2019 ఏడాది నాటి స్థాయికి అమ్మకాలను సాధించామని’ వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఛార్లెస్ తెలిపారు. దేశీయంగా అసాధారణ డిమాండ్‌ను దక్కించుకున్నాం. రానున్న రోజుల్లో సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తామని చార్లెస్ వెల్లడించారు.

కొవిడ్-19 వ్యాప్తి కొనసాగినంత కాలం ఆటో పరిశ్రమకు కఠినమైన సమయం. ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తూ తగిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు, వినియోగదారుల కొనుగోలు సరళిని గమనిస్తున్నామని ఆయన వివరించారు. చరిత్రలోనే తొలిసారి మే నెలలో ఒక్క కారును కూడా విక్రయించలేదు. కానీ, ఆగష్టు నాటికి పరిస్థితులు మారి అమ్మకాలు పుంజుకుంటున్నాయి. కరోనాకు ముందునాటి స్థాయికి చేరుకునే దిశగా వెళ్తున్నామని చార్లెస్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed