వోడాఫోన్ ఐడియా నికర నష్టం రూ.25,460కోట్లు

by  |
వోడాఫోన్ ఐడియా నికర నష్టం రూ.25,460కోట్లు
X

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి వోడాఫోన్ ఐడియా నికర నష్టం రూ.25,460కోట్లుగా ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నికర నష్టం రూ.4,874కోట్లు ఉండటం గమనార్హం. కార్యకలాపాల ద్వారా ఆదాయం 8 శాతం క్షీణించి రూ.10.659.30కోట్లుగా ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో స్పష్టం చేసింది.

అడ్జస్ట్‌మెంట్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్‌) బకాయిల కింద టెలికాంశాఖకు వాయిదాల పద్ధతిలో రూ.6,584.40కోట్లను ప్రస్తుత త్రైమాసికంలో చెల్లించినట్టు పేర్కొంది. ఏజీఆర్ బకాయిల కింద చెల్లించాల్సిన మొత్తం రూ.58,254కోట్లకు అదనంగా రూ.19,440.50 చెల్లించాల్సి రావడం తలకు మించిన భారంగా పరిణమించిందని తెలిపింది. ప్రస్తుత త్రైమాసికంలో నికర విలువ రుణాత్మకంగా (-రూ.19,491.80 కోట్లు) మారిందని వోడాఫోన్ ఐడియా ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తమ టెలికాం సేవలకు తీవ్ర అంతరాయం కలిగిందని పేర్కొంది.


Next Story