- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
శశికళకు అస్వస్థత.. హాస్పిటల్‌లో అడ్మిట్
by Shamantha N |

X
బెంగళూరు: తమిళనాడు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ బెంగళూరులోని హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. జ్వరం, వెన్నునొప్పితో బాధపడుతున్న ఆమె ఆక్సిజన్ స్థాయిలు బుధవారం ఉదయం పడిపోవడంతో బెంగళూరు జైలు హాస్పిటల్ వైద్యులు కొవిడ్-19 సోకినట్లుగా భావించి హాస్పిటల్‌కు తరలించారు. బెంగళూరులోని బౌరింగ్ ప్రభుత్వ హాస్పిటల్‌లో చేరిన శశికళకు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నిర్వహించడంతోపాటు స్వాబ్ సేకరించి ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం పంపారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో గత నాలుగేండ్లు బెంగళూరు జైలులో శశికళ శిక్ష అనుభవిస్తున్నారు. సత్ప్రవర్తన కారణంగా ఈ నెల 27న ఆమె జైలు నుంచి విడుదల కానున్నారు. అంతకుముందు రూ.10కోట్లు జరిమానా చెల్లించాల్సి ఉంది.
Next Story