ఇండియన్ మార్కెట్‌లోకి ‘వివో వై 30’

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో.. తన వై సిరీస్‌ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘వివో Y30’ని ఈ రోజు( శుక్రవారం, జులై 3) లాంచ్‌ చేసింది. ఇప్పటికే మలేషియాలో లాంచ్ అయిన ఈ ఫోన్లు.. ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వివో కంపెనీ అఫిషియల్ సైట్‌లోనూ ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి లాంచింగ్ సేల్ ప్రారంభం కానుంది. డాజిల్ బ్లూ, ఎమరాల్డ్‌ బ్లాక్‌ కలర్స్‌లో లభించనుంది. అంతేకాదు లాంచింగ్ ఆఫర్లుగా యాక్సిస్ బజ్ క్రెడిట్ కార్డుపై 10 శాతం, యూపీఐ ఫస్ట్ ట్రాన్సక్షన్‌పై 30 శాతంతో పాటు నో కాస్ట్ ఈఎమ్ఐ ఫెసిలిటీని అందించనుంది.

వై30 ఫీచర్స్ :

డిస్‌ప్లే : 6.47ఇంచులు
ప్రాసెసర్‌ : మీడియాటెక్‌ హీలియో పీ35
ఇంటర్నల్ స్టోరేజ్‌ : 128జీబీ
ర్యామ్‌ : 4జీబీ
రేర్‌ కెమెరా : 13+8+2+2 మెగా పిక్సల్‌
ఫ్రంట్‌ కెమెరా : 8 మెగా పిక్సల్‌
బ్యాటరీ : 5000mAh
ఓఎస్‌ : ఆండ్రాయిడ్‌ 10
కలర్స్ : డాజిల్ బ్లూ, ఎమరాల్డ్ బ్లాక్
ధర : రూ. 14,990/-

Advertisement