మంత్రులనే కలవని కేసీఆర్.. ప్రజలను కలుస్తాడా : వివేక్

by Sridhar Babu |   ( Updated:2021-10-27 03:11:47.0  )
మంత్రులనే కలవని కేసీఆర్.. ప్రజలను కలుస్తాడా : వివేక్
X

దిశ, హుజురాబాద్ రూరల్ : ఎప్పుడూ ఫామ్ హౌజ్‌లో పడుకునే సీఎం ఐదు నెలలుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడని కేవలం ఈటలను ఓడించేందుకే ఈ ప్రయత్నాలని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు వివేక్ అన్నారు. హుజురాబాద్ మండలంలో బుధవారం నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ ప్రజలు ఈటలను ఎలాగైనా గెలిపిద్దామని కంకణం కట్టుకున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూడేళ్లైనా ఒక్క బొట్టు నీరు రాలేదన్నారు.

ఈ ప్రాజెక్టులో రూ. 65 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. తుగ్లక్ ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కూల్చేసి పది వేల కోట్ల నష్టం చేశాడని మండిపడ్డారు. ప్రజలు బానిసలుగా ఉండాలని.. బాగుపడకూడదని చూస్తున్నాడని వివేక్ ఆరోపించారు. దళితులందరికీ ఎలాంటి కండిషన్లు లేకుండా 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన ఓటు హక్కుతో కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని హుజురాబాద్ ప్రజలను కోరారు. మంత్రులనే కలవని ముఖ్యమంత్రి.. కేసీఆర్ ఒక్కడేనని.. అలాంటి వ్యక్తి ప్రజలను ఎప్పుడు కలుస్తారని ప్రశ్నించారు.

Next Story

Most Viewed