యంగ్ హీరోతో గుత్తా జ్వాల పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!

by Shyam |
యంగ్ హీరోతో గుత్తా జ్వాల పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!
X

దిశ, సినిమా : హీరో విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది. మీడియా, సోషల్ మీడియాలో వీరి రిలేషన్‌షిప్‌పై చాలా రూమర్స్ స్ప్రెడ్ కాగా.. ఫైనల్లీ లైఫ్ పార్ట్‌నర్స్ కాబోతున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ పోస్ట్ చేసిన జంట.. అభిమానుల ఆశీర్వచనాలు కావాలని కోరారు. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో ఏప్రిల్ 22న పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. చాలా కొద్ది మంది బంధుమిత్రుల నడుమ వివాహమహోత్సవం జరగబోతున్నట్లు తెలిపారు. ‘జీవితం అనేది ఒక ప్రయాణం.. నమ్మకంతో దాన్ని హత్తుకొని ముందడుగు వేయాల్సిందే’ అన్న విష్ణు విశాల్.. ఇప్పటి వరకు తమపై కురిపించిన ప్రేమ, భవిష్యత్తులోనూ కొనసాగాలని కోరుకుంటున్నాం అన్నారు.

Advertisement

Next Story