ఇవి కలిపి తింటే అంతే.. అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ కాంబినేషన్స్

by Shyam |
ఇవి కలిపి తింటే అంతే.. అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ కాంబినేషన్స్
X

దిశ, ఫీచర్స్ : ‘యూ ఆర్ వాట్ యూ ఈట్’ (మీరు తినే ఆహారమే మీ ఆరోగ్యకర శరీరానికి సంకేతం) అని వైద్యులు తరచుగా చెబుతుంటారు. అయితే మనకు తెలిసో తెలియకో కొన్ని ఆహార పదార్థాలను కలిపి తినేస్తుంటాం. అలాంటి విరుద్ధ కలయికలు గట్‌(స్టమక్)కు భంగం కలిగించవచ్చు, అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చు. కాబట్టి తినే పదార్థాలపై జాగ్రత్త వహించాలి. ఆయుర్వేదం ప్రకారం ప్రతీ ఆహార పదార్థం శరీరంపై ప్రత్యేకమైన శక్తి, రుచి, ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ క్రమంలో మనం అవాయిడ్ చేయాల్సిన కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ గురించి ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ దీక్షా భావ్సర్ వివరించారు.

పాలు – చేప

ఈ రెండు ఆహారాలు పొంతన లేని పదార్థాలు. చేపలతో పాలు తినకూడదు. ఎందుకంటే పాలు చలువనిస్తే, చేపలకు వేడి చేసే గుణం ఉంటుంది. ఈ రెండింటినీ కలపడం వల్ల రక్తానికి హాని కలుగుతుంది. బాడీ చానెల్స్ (స్రోటాస్ అని పిలుస్తారు)‌కు ఇది అడ్డంకిగా మారొచ్చు. ఉప్పు, పాలు కలయిక కూడా మంచిది కాదు.

పండ్లు – పాలు

అరటిపండును పాలు, పెరుగు లేదా మజ్జిగతో కలిపి తినకూడదు. ఈ కలయిక జీర్ణశక్తిని తగ్గించి, శరీరంలో టాక్సిన్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు దగ్గు, జలుబు, అలర్జీలకు కారణమవుతాయి.

వేడిచేసిన తేనె

తేనెను వేడి చేయడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియకు తోడ్పడే ఎంజైమ్స్ నాశనమవుతాయి. అందువల్ల తినేటప్పుడు శరీరంలో టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయి.

సమాన పరిమాణంలో నెయ్యి, తేనె

నెయ్యి, తేనెను సమాన పరిమాణంలో అస్సలు కలపొద్దు. అలా చేస్తే అవి శరీరంలో వ్యతిరేక ప్రతిచర్యలను కలిగిస్తాయి. తేనె వేడి పదార్థం కాగా నెయ్యి శీతలీకరణ, మాయిశ్చరైజింగ్ నాణ్యతను కలిగి ఉంటుంది. ఒక వేళ ఈ రెండింటిని కలిపి తినాలనుకుంటే ఒకటి కాస్త ఎక్కువ, మరొకటి కాస్త తక్కువ పరిమాణంలో తీసుకుంటే సరి.

రాత్రి పెరుగు తినడం

పెరుగు(పెరుగు, చీజ్, కాటేజ్ చీజ్) శీతాకాలంలో తినడానికి అనువైనదే కానీ రాత్రిపూట తినకూడదు. అయితే మజ్జిగ తీసుకోవచ్చు.

ఇవి ఆయుర్వేద వైద్యురాలు దీక్ష సూచించిన విరుద్ధ కలయికగా పరిగణించబడే ఆహార పదార్థాల వివరాలు. అయితే మీ ఆరోగ్యం లేదా వైద్య పరిస్థితికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే మీ డాక్టర్ లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుల మార్గదర్శకత్వం, సలహాలు పాటించొచ్చు.

Advertisement

Next Story

Most Viewed