ప్లీజ్ ఆపెయ్యండి.. మనకొద్దు: సెహ్వాగ్, యువీ

by Shyam |
ప్లీజ్ ఆపెయ్యండి.. మనకొద్దు: సెహ్వాగ్, యువీ
X

దేశరాజధానిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటిస్తున్న వేళ… పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీ దాడులతో అట్టుడికిన సంగతి తెలిసిందే. దీనిపై టీమిండియా మాజీ దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌ సోషల్‌ మీడియా ద్వారా ఆందోళణ వ్యక్తం చేశారు.

‘ఢిల్లీలో జరుగుతున్న ఘటనలు దురదృష్టకరం. ఢిల్లీలో ప్రతిఒక్కరు ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరికైనా ఏదైనా గాయం లేదా ఆపద కలిగితే అది గొప్ప భారతదేశ రాజధానికే మాయని మచ్చ అవుతుంది. శాంతి నెలకొనేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని’ సెహ్వాగ్‌ పిలుపునిచ్చాడు.

ఇక యువరాజ్ సింగ్ తన ట్విట్టర్ ద్వారా ‘ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు విచారకరం. దయచేసి అందరూ శాంతి, సామరస్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. మనమంతా మనుషులమే. మనమంతా ఇతరుల పట్ల ప్రేమ, గౌరవంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని’ అంటూ ట్వీట్‌ చేశాడు.

కాగా, సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు చేపట్టిన అల్లర్లలో ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మంది గాయపడ్డారు. అందులో 48 మంది పోలీసులు ఉండడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed