విరాటపర్వంలో ‘కామ్రేడ్ భారతక్క’గా ప్రియమణి

by Shyam |
విరాటపర్వంలో ‘కామ్రేడ్ భారతక్క’గా ప్రియమణి
X

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పీరియాడికల్ రొమాంటిక్ యాక్షన్ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంతకు ముందే సాయి పల్లవి లుక్ రిలీజ్ చేసి వావ్ అనిపించిన ఈ మూవీ యూనిట్ నుంచి తాజాగా మరో అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రియమణి పుట్టినరోజును పురస్కరించుకుని.. తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. కాగా నక్సలైట్ డ్రెస్‌, భుజాన తుపాకి, ముఖంపై చిరునవ్వుతో కాన్ఫిడెన్స్‌గా కనిపిస్తున్న ప్రియమణి లుక్.. సినిమాపై అంచనాలను పెంచేసింది.

‘మహాసంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారితీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్‌లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో.. విరాటపర్వంలో కామ్రేడ్ భారతక్క కూడా అంతే కీలకం’ అంటూ ప్రియమణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది మూవీ యూనిట్.

ఇక సాయి పల్లవి.. పుట్టినరోజు శుభాకాంక్షలు భారతక్క అంటూ విష్ చేసింది . ‘పని పట్ల మీకున్న అభిరుచి, ప్రయత్నించడంలో మీరు చూపించే ఆసక్తి చూసి.. మిమ్మల్ని ఆరాధించడం మొదలుపెట్టాను. నేను మిమ్మల్ని నిజంగా ఆరాధిస్తాను. సెట్స్‌లో మళ్లీ కలిసేదాకా వెయిట్ చేయలేకపోతున్నానని’ చెప్పింది.

Advertisement

Next Story