- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘విరాట పర్వం’ రానా ఫస్ట్‌లుక్..

దిశ, వెబ్‌డెస్క్: కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ రోల్స్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ హీరో రానా. ‘లీడర్’ మూవీతో ఇండస్ట్రీకి వచ్చిన రానా ప్రస్తుతం ‘విరాట పర్వం’ చిత్రంలో నటిస్తున్నాడు. సోమవారం రానా బర్త్ డే. ఈ సందర్భంగా ‘విరాట పర్వం’లోని రానా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. నక్సల్స్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో సాయిపల్లవి, ప్రియమణి, నివేదా పేతురాజ్,నందితాదాస్, నవీన్‌చంద్ర నటిస్తున్నారు.
కామ్రేడ్ రవి అన్నగా ఏకే 47 పట్టుకుని గంభీరంగా నడుస్తున్న రానా లుక్ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో రానా కంటే ముందే సాయిపల్లవి పేరు వేయడం విశేషం. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకుడు. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్ర సమర్పకులు డి.సురేశ్ బాబు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. జరీనా వహాబ్, ఈశ్వరి రావు, సాయి చంద్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
https://twitter.com/taran_adarsh/status/1338327653317627905/photo/1