కోహ్లీకి కలసిరాని 2020

by Shyam |
కోహ్లీకి కలసిరాని 2020
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది అత్యంత పేలవ ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది ఆడిన చివరి మ్యాచ్‌లో భారత జట్టు 36 పరుగుల అత్యల్ప స్కోర్‌కు ఆలౌట్ అవడం కెప్టెన్‌గా అతడి కెరీర్‌లో మరకలా నిలిచిపోనున్నది. మరోవైపు 2008 నుంచి ఏదో ఒక ఫార్మాట్‌లో సెంచరీ బాదుతున్న విరాట్ కోహ్లీ తొలి సారిగా 2020లో సెంచరీ మిస్ అయ్యాడు. ఈ ఏడాది 6 టెస్ట్ ఇన్నింగస్‌లతో పాటు 9 వన్డేలు, 9 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 24 ఇన్నింగ్స్‌లో కేవలం 6 అర్ద సెంచరీలు మాత్రమే ఉన్నాయి.

న్యూజీలాండ్ పర్యటనలో ఆడిన టెస్టుల్లో అతడి అత్యధిక స్కోర్ కేవలం 38 పరుగులు మాత్రమే. ఆ తర్వాత ఆడిండి అడిలైడ్ టెస్టులోనే. ఇక ఐపీఎల్‌లో బ్యాటుతో పర్వాలేదనిపించినా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు టైటిల్ తెచ్చిపెట్టడంలో మరోసారి విఫలమయ్యాడు. ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమిపాలై వెనుదిరిగింది. మొత్తానికి కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2020 కెరీర్ పరంగా అసలు కలసిరాలేదనే చెప్పాలి.

Advertisement

Next Story

Most Viewed