రసమయికి ఛాలెంజ్ విసిరిన వినోద్‌కుమార్

by Shyam |
రసమయికి ఛాలెంజ్ విసిరిన వినోద్‌కుమార్
X

దిశ, న్యూస్‌బ్యూరో: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా మినిస్టర్స్ క్వార్టర్స్‌లో కుటుంబ సభ్యులతో కలిసి మూడు మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా ముద్దు బిడ్డ, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి సంతోష్ కుమార్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్, పార్టీకి మధ్య సమన్వయ కర్తగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారని అభినందిచారు. హుస్నాబాద్, మానకొండూరు ఎమ్మెల్యేలు ఒడితెల సతీష్ కుమార్, రసమయి బాలకిషన్, కరీంనగర్ జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయకు మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.

Advertisement

Next Story