గ్యాస్‌ గోడౌన్‌ వద్దు.. వాటర్ ట్యాంక్ ఎక్కి గ్రామస్తుడి నిరసన

by Sumithra |   ( Updated:2021-08-27 01:38:31.0  )
గ్యాస్‌ గోడౌన్‌ వద్దు.. వాటర్ ట్యాంక్ ఎక్కి గ్రామస్తుడి నిరసన
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఓ వ్యక్తి(నూనె నాగన్న) నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టాడు. గ్యాస్ గోడౌన్‌ తరలించాలంటూ 12 రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ నిరసన వ్యక్తం చేశాడు. మండల కేంద్రంలోని ఓ గ్యాస్ డీలర్ వినియోగదారులను నిలువుదోపిడి చేస్తూ రశీదు ఇవ్వకుండా అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని, గ్రామ నడిబొడ్డున గ్యాస్ గోడన్ ఏర్పాటు చేసి గ్రామస్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వాపోయాడు. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తూ.. నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు నీళ్ల ట్యాంక్ వద్దకు చేరుకొని.. గ్యాస్ గోడౌన్ తరలింపునకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో నూనె నాగన్న కిందకు దిగాడు.

Advertisement

Next Story