- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేపలవేట… పొంచిన కరోనా వేటు..
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి కారణంగా ప్రస్తుతం దేశమంతటా కూడా లాక్‌డౌన్ కొనసాగుతున్నది. కేవలం స్వీయ నియంత్రణ ద్వారానే దానిని కట్టడి చేయొచ్చన్న ముఖ్య ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది ప్రజలు ఇళ్లకే పరిమితమై ప్రభుత్వాల నిబంధలను చక్కగా పాటిస్తూ కరోనాను నియంత్రించే యుద్ధంలో భాగస్వాములవుతున్నారు. అయితే కొంతమంది ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్లు వ్యహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు, డాక్టర్లు, ఇతర నిపుణులు ఎంత చెబుతున్నా కూడా వారికి ఏ మాత్రం చెవికెక్కడంలేదు. తమకు నచ్చినట్టుగా ఎక్కడపడితే అక్కడ.. ఎలా పడితే అలా సంచరిస్తున్నారు. వీరితో కరోనా మరింత ప్రబలే అవకాశముంది. దీంతో ప్రభుత్వం, ప్రజలు చేస్తున్న లాక్‌డౌన్ దీక్ష విఫలమయ్యే అవకాశం లేకపోలేదు. అంతేకాదు… ఈ కొంతమంది వ్యక్తుల వల్ల మిగతా వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రాకమానదనే చెప్పాలి.
విషయమేమిటంటే.. ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతున్నందున ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రాకుండా స్వీయ నియంత్రణను పాటిస్తున్నారు. పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. అందులో ముఖ్యంగా సామాజిక దూరం ఖచ్చితంగా పాటిస్తున్నారు. అయితే.. పల్లెటూర్లలో కొంతమంది ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఆ పల్లెటూర్లలో ఉండే చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, బావులు.. ఇలా చేపలు ఎక్కడ ఉంటే అక్కడ టైం పాస్ కోసమని చేపల వేటకు వెళ్తున్నారు. . ఇలా వీళ్లంతా వెళ్లినప్పుడు ఏ మాత్రం సామాజిక దూరం పాటించడంలేదు. వాళ్లంతా కూడా పెద్ద సంఖ్యలో చాలామంది గుమిగూడి చేపల వేటకు వెళ్తున్నారు. అందరూ కలిసి చేపలు పడుతున్నారు. ఆ సమయంలో ఏ మాత్రం కూడా ప్రభుత్వ నిబంధలను పాటించడంలేదు. ఇలా తమకు ఇష్టంవచ్చినట్లుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారు. అసలు విషయమేమిటంటే.. చేపలు పట్టేవారిలో ఎవ్వరికైనా కరోనా వైరస్ సోకి ఉంటే వారి వల్ల ఆ వైరస్ అక్కడ చేపలు పట్టే వైరస్ సోకే అవకాశముంది. అటు నుంచి వారి వారి కుటంబాలకు, అటు నుంచి పల్లెవాసులకు, అక్కడి నుంచి పట్నం వాసులకు చేరే అవకాశముంది.
ఇంట్లో ఉంటే ఏం టైంపాస్ అవుతలేదు..
లాక్‌డౌన్ కారణంగా ఎవ్వరినీ కూడా ఇంట్లో నుంచి పోలీసులు బయటకు వెళ్లనియ్యడంలేదు. ప్రజలు కూడా ఇళ్లకే పరిమితమై స్వీయనియంత్రణను పాటిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం.. అందులో ఎక్కువ శాతం యువకులు ఇళ్లలో ఎంతకాలం ఉండాలి.. ఏం టైం పాస్ అవుతలేదు.. పిచ్చెక్కుతోందంటూ కొంతమంది కలిసి చేపలు వేటకు వెళ్దాం పదా.. అలాగైనా టైంపాస్ అవుతదని వెళ్తున్నారు. అయితే.. ఇలా వెళ్లితే టైం పాస్ అవడం ఏమో గానీ, అసలుకు ఎసరు వచ్చే అవకాశముంది. అందువల్ల చేపల వేటకు పోకుండా ఇంటి పట్టున ఉండడమే అత్యుత్తమం.
పట్నం నుంచి పల్లెటూరికొచ్చి..
పల్లెటూర్లకు చెందిన చాలామంది ప్రజలు బతుకుదెరువు కోసమని పట్నాలకు వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా వారంతా కూడా మళ్లీ తిరిగి పల్లెటూర్లకొచ్చారు. అలా వచ్చిన వీరిలో కొంతమంది ఈ చేపల వేటకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. కారణమేమిటంటే.. ఇంట్లో ఉండడం కష్టంగా ఉంది.. పట్నంలో అయితే మేం చాలా బిజీబిజీగా లైఫ్ ను గడిపాం.. ఇన్ని రోజులపాటు ఇంట్లో ఉండడం చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. అసలు ఏం తోయడంలేదు. కానీ, లాక్ డౌన్ అయిపోయే వరకు ఇలాగే ఉండడం తప్పదు గనుక ఈ సమయంలో చేపల వేటకు వెళ్లి లాక్ డౌన్ రోజులు గడిపేయ్యొచ్చు అంటూ నలుగురిని గుమిగూడ్చి చేపల వేటకు వెళ్తున్నారు. మరికొన్ని చోట్ల అయితే ఈతకు వెళ్తున్నారు. ఈత కొట్టే సమయంలో కూడా కరోనా వైరస్ సోకే అవకాశముంది. ఎందుకంటే అందులో ఏ ఒక్కరికి ఆ వైరస్ ఉన్నా కూడా అక్కడున్న వారందరికీ.. అటునుంచి పల్లెవాసులు.. అటు నుంచి మిగతా వారందరికీ చేరే అవకాశముంది.
కరోనాను కట్టిడి చేసేందుకు మనకున్నది ఒక్కటే మార్గం.. అది స్వీయ నియంత్రణ మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటిస్తూ కరోనాతో జరుగుతున్న ఈ యుద్ధంలో భాగస్వాములు కావాలి. కానీ, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ కరోనా వైరస్ బారినపడొద్దు. చేపల వేట, ఈతలు కొట్టకుండా కుండా ఇంట్లోనే ఉంటూ సామాజిక దూరం పాటించాలి.
Tags: fish, people, rural area, police, corona,