- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్షలు కుమ్మరించి ఏం లాభం.. చివరకు గాలికొదిలేశారు
దిశ, శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లాలోని ప్రజలకు తక్కువ ధరలకు కూరగాయలు అందించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సంతలు నిరూపయోగంగా మారాయి. జిల్లాలోని శంకర్ పల్లి మండలంలోని పలు గ్రామాల్లో రూర్బన్ పథకం కింద 15 గ్రామ సంతలు మంజూరయ్యాయి. కానీ, భూవివాదం కారణంగా ఎర్వగూడ గ్రామ సంత నేటికీ ప్రారంభం కాలేదు. ఒక్కో గ్రామ సంతను రూ.12 లక్షలు వెచ్చించి నిర్మాణం చేపట్టారు. జన్వాడ, కొండకల్, టంగుటూరు, ఇంద్ర రెడ్డి నగర్, గోపులారం, దొంతాన్ పల్లి, రావులపల్లి కలాన్, గాజుల గూడ, అలంకాని గూడ, మహారాజ్పేట్ గ్రామాల్లో ఈ సంతల నిర్మాణం పూర్తయ్యింది. అలాగే, అంతప్పగూడ, మహాలింగాపురం, లక్ష్మారెడ్డి గూడ గ్రామాలలో పనులు కొనసాగుతున్నాయి. పూర్తయిన గ్రామ సంతలలో మార్కెట్ నిర్వహించకుండా నిరుపయోగంగా వదిలేశారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించిన జనవాడ గ్రామ సంత ఎంతో అట్టహాసంగా ప్రారంభించినప్పటికీ ఉపయోగంలోకి రాలేదు. గౌడిచర్ల లలిత నర్సింహ గ్రామ సర్పంచ్ జన్వాడ గ్రామంలో నిర్మించిన గ్రామ సంత లో త్వరలో కూరగాయల మార్కెట్ ప్రారంభిస్తాం. గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి కూరగాయల మార్కెట్ ఏర్పాటు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. గ్రామ సంతలను ఎంపీడీవో సత్తయ్య సర్పంచులకు అప్పగించారు. రూర్బన్ పథకం కింద నిర్మించిన గ్రామ సంతలు దాదాపు పూర్తవ్వగా, మూడు గ్రామాల్లో పనులు కొనసాగుతుండగా, మిగతా గ్రామాల్లో పూర్తయ్యాయి. ఎర్వగూడ గ్రామంలో భూమి వివాదం ఉన్న నేపథ్యంలో సంతలు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. అయితే, నిర్మించిన గ్రామ సంతలు వినియోగంలోకి తీసుకోకపోవడంపై వివరణ కోరగా సర్పంచ్లు నిర్వహించుకోవాల్సి ఉంటుంది.