- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిజీ షెడ్యూల్‌లో విక్రమ్.. మణిరత్నంకు డేట్స్ ఇస్తాడా?
దిశ, సినిమా: చియాన్ విక్రమ్ ‘కోబ్రా’పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో ఏడు పాత్రల్లో కనిపించనున్న విక్రమ్.. మరోసారి ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ కూడా పూర్తి కాగా.. విక్రమ్ వచ్చే వారంలో మరోసారి ‘కోబ్రా’ సెట్స్‌లో జాయిన్ కానున్నారు. 30-35 రోజుల లాంగ్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని టాక్. ఇది కంప్లీట్ కాగానే ఫైనల్ షెడ్యూల్‌ను మేకర్స్ విదేశాల్లో ప్లాన్ చేశారని సమాచారం. ఈ మేరకు ఏప్రిల్ లేదా మే నెలలో కోబ్రా యూనిట్ విదేశాలకు వెళ్లే చాన్స్ ఉండగా.. ఈ గ్యాప్‌లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రానికి డేట్స్ యూజ్ చేయాలని విక్రమ్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇందులో చోళ రాజు ఆదిత్య కరికాలన్‌గా కనిపించబోతున్నారు విక్రమ్.
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో విక్రమ్‌తో పాటు జయం రవి, కార్తి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిషా కృష్ణన్ ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చనున్నారు.