‘24’ సీక్వెల్ పనిలో విక్రమ్..

by Shyam |   ( Updated:2020-06-12 01:36:12.0  )
‘24’ సీక్వెల్ పనిలో విక్రమ్..
X

సౌత్ ఇండియన్ స్టార్ సూర్య, డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘24’. టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి, విమర్శకుల ప్రశంసలు పొందింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ చేయనున్నట్లు ప్రకటించారు డైరెక్టర్ విక్రమ్.

తాజాగా ఓ తమిళ చానల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని విక్రమ్ వెల్లడించాడు. ‘24 సినిమా రిలీజ్ అయినప్పుడే సీక్వెల్ గురించి సూర్యకు, నాకు మధ్య ఈ చర్చ జరిగింది. కానీ ఏదో సీక్వెల్ చేశామా అంటే చేశాం అన్నట్లుగా కాకుండా.. బౌండెడ్ స్క్రిప్ట్‌తో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్ అందించాలనుకున్నాం’ అని చెప్పాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నట్లు తెలిపిన విక్రమ్.. స్టోరీ పర్ఫెక్ట్‌గా ఉందని అనిపిస్తే వెంటనే సూర్యను కలిసి కథ చెప్తానని తెలిపాడు.

సూర్య తొలిసారి మూడు పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రీక్వెల్ ఉందని విక్రమ్ అంతకు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. సూర్య ఈ సినిమాలో పోషించిన పాత్రల్లో ఒకటైన ఆత్రేయ క్యారెక్టర్ బేస్ చేసుకుని ఈ స్టోరీ ఉంటుందని చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed