కాంగ్రెస్ నేతలపై విక్రమ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2020-11-27 02:50:44.0  )
కాంగ్రెస్ నేతలపై విక్రమ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా సంచలన ఆరోపణలు చేయడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోంది. తాజాగా బీజేపీ కండువా కప్పుకుంటున్న మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ హస్తం పార్టీ పై విమర్శలు సంధించారు. టీకాంగ్రెస్‌లో ఉన్న సీనియర్ నేతలే టీఆర్ఎస్ పార్టీ కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీలో తమ కుటుంబం, తనకు సముచిత స్థానం కల్పించలేదని విక్రమ్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలు ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం తమదే అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ప్రచారాలు చేస్తుంటే సొంతపార్టీ నేతలు రాజీనామాలు, ఆరోపణలు చేయడం గమనార్హం. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్న నేతలు సైతం కాంగ్రెస్ పార్టీని ఇంకా ఎన్నాళ్లు మోయాలని కుండబద్దలు కొట్టడంతో ఇతర నేతలు కూడా ఆందోళనలో పడ్డారు. కాంగ్రెస్‌లో ఉంటే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్న సందేహాంలో ఆ పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story