చియాన్@60.. ధ్రువ్‌తో స్ర్కీన్ షేర్

by Shyam |
చియాన్@60.. ధ్రువ్‌తో స్ర్కీన్ షేర్
X

హీరో విక్రమ్ ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్. ప్రస్తుతం కోబ్రా, పొన్నియిన్ సెల్వన్, నట్ చతిరమ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విక్రమ్.. మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారట. చియాన్ 60వ సినిమాలో కొడుకు ధృవ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. టాలెంటెడ్ పవర్ హౌజెస్‌ అయిన ఈ తండ్రీ కొడుకులను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేయబోతుండగా అనిరుధ్ సంగీతం సమకూర్చే అవకాశం ఉంది. ఇక 7 స్క్రీన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలుస్తోంది. చియాన్ ధృవ్ నటించిన ‘ఆదిత్య వర్మ’లో చిన్న పాత్ర చేసినా వీరిద్దరినీ ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం ఫ్యాన్స్‌కు దక్కలేదు. దీంతో కొత్త సినిమాతో ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసే కోరిక నెరవేరనుందని ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న పెంగ్విన్ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తుండగా ధనుష్‌ హీరోగా ‘జగమే తంధిరమ్’ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. అటు విక్రమ్.. ఇటు కార్తీక్ సుబ్బరాజ్.. ఇద్దరు తమ తమ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాకే ఈ సినిమా ప్రారంభిస్తారని తెలుస్తోంది.

Advertisement

Next Story