బైసెక్సువల్ అని ఫ్యామిలీ వదిలేసింది : వికాస్ గుప్తా

by Jakkula Samataha |
బైసెక్సువల్ అని ఫ్యామిలీ వదిలేసింది : వికాస్ గుప్తా
X

దిశ, వెబ్‌డెస్క్ : టెలివిజన్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్, హిందీ బిగ్ బాస్ సీజన్ 11 కంటెస్టెంట్ వికాస్ గుప్తా మరోసారి హెడ్ లైన్స్‌లో నిలిచారు. ఈ ఏడాది జూన్‌లో తాను బైసెక్సువల్ అని మీడియాకు బహిర్గతం చేసిన వికాస్.. ఈ ప్రకటన తర్వాత తన సోదరుడు సిద్ధార్థ్ గుప్తాతో పాటు తల్లి నుంచి కూడా వివక్ష ఎదుర్కొన్నట్లు తెలిపాడు. తాజాగా సిద్ధార్థ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ పిక్స్‌లో వికాస్ లేకపోవడంతో ఓ మీడియా చానల్ ఇందుకు సంబంధించిన వివరాలు అడిగింది. దీనికి సమాధానమిస్తూ ఓపెన్ అయిపోయాడు వికాస్. తను బైసెక్సువల్ అని ప్రపంచానికి తెలిపాక.. తన చుట్టూ ఉండే ప్రపంచం చాలా వరస్ట్‌గా మారిపోయిందన్నాడు. సోదరుడు, తల్లి.. తనను, తన ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయారని తెలిపాడు. తనతో ఉండడాన్ని ఇబ్బందిగా ఫీల్ అయ్యారని, కనీసం తనను చూడటం కూడా వారికి ఇష్టం లేదని చెప్పాడు. మన సమాజం చాలా కఠినమైనదని, ఇలాంటివి యాక్సెప్ట్ చేయడం కష్టమన్న వికాస్.. వారి బర్త్ డే మూడ్‌ను ఖరాబ్ చేయడం తనకు కూడా ఇష్టం లేదన్నాడు.

ఇక తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో వికాస్ ఎందుకులేడని సిద్ధా‌ర్థ్‌ను ప్రశ్నించగా.. అది తన పర్సనల్ విషయమన్నాడు. తన పుట్టినరోజు వేడుకలు వార్తల్లో నిలవాలని కోరుకోవడం లేదని సమాధానమిచ్చాడు. అయినా ఇది తన పర్సనల్ అయినప్పుడు దీని మీద ఎందుకు ప్రశ్నిస్తున్నారన్నాడు సిద్ధార్థ్.

కాగా వికాస్.. జూన్‌లో సోషల్ మీడియా వేదికగా బైసెక్సువల్ అని ప్రకటించాడు. జెండర్‌తో సంబంధం లేకుండా మనుషులందరితో తను లవ్‌లో పడిపోతున్నానని, ప్రపంచంలో చాలా మంది నాలానే ఉన్నారని చెప్పాడు. బైసెక్సువల్ అని గర్వంగా చెప్తున్నట్లు తెలిపాడు.

Advertisement

Next Story