- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బెజవాడ రౌడీలపై పోలీసుల నజర్
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల బెజవాడలో జరిగిన గ్యాంగ్‌వార్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రెండు గ్రూపులు కత్తులు, కర్రలతో దాడులకు పాల్పడి బీభత్సం సృష్టించాయి. ఈ ఘర్షణలో తోట సందీప్ అనే మాజీ రౌడీషీటర్ ప్రాణాలు సైతం కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. ప్రశాంతంగా ఉన్న బెజవాడలో ఈ అల్లర్లు అలజడులు క్రియేట్ చేయడంతో.. పోలీసులు అలెర్టయ్యారు. కేసును సీరియస్‌గా తీసుకోని విచారించారు. గొడవతో సంబంధం ఉన్నవాళ్లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. అంతేకాక మొత్తం రౌడీషీటర్ల ఏరివేతపై ఫోకస్ పెట్టారు.
మొత్తం బెజవాడ నగరంలో 400 మందికి పైగా రౌడీషీటర్లను పోలీసులు గుర్తించారు. వారిలో 70 మంది ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్నట్టు నిర్ధారించారు. రాత్రిపూట వారి కదలికలపై నిఘా పెట్టి.. అతి చేస్తోన్న నలుగురిని నగర బహిష్కరణ చేశారు. మరికొందర్ని కూడా నగర బహిష్కరణ కోసం లిస్ట్ ఔట్ చేశామని టీవీ9తో సీపీ శ్రీనివాసులు తెలిపారు. రౌడీషీటర్లు.. గంజాయి, డ్రగ్స్ సేవించడంతో పాటు విద్యార్థులే లక్ష్యంగా వాటి విక్రయాలు జరుపుతున్నట్టు గుర్తించారు. చాలామంది విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలు అవుతున్నారని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి బెజవాడ సీపీ సూచించారు.