దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభానికి బ్రేక్.. ఎందుకంటే ?

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి బ్రేక్ పడింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూయడంతో… ఆయన్ను స్మరించుకునేందుకు కేంద్రం వారం పాటు సంతప దినాలను ప్రకటించాలని తెలిపింది. దీంతో ఈనెల 4న ప్రారంభం కావల్సిన ఫ్లైఓవర్ కార్యక్రమం వాయిదా పడింది. ఈనెల 7 లేదా 8న ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కొద్దిరోజుల క్రితమే నిర్మాణ పనులు పూర్తి కాగా, ఫ్లైఓవర్‌కు సంబంధించిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.

Advertisement