లక్షల కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్.. విజయశాంతి సంచలన ఆరోపణలు

by Sridhar Babu |
లక్షల కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్.. విజయశాంతి సంచలన ఆరోపణలు
X

దిశ, కమలాపూర్: కేసీఆర్ అవినీతి ఎక్కడ జరిగినా చెప్పాలంటూ.. ప్రజలకు పెద్దపెద్ద సూచనలు చేస్తున్నారని, నిజానికి కేసీఆరే పెద్ద అవినీతి పరుడు అని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బుధవారం ఈటలకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేలాది మంది రైతులు చస్తుంటే కేసీఆర్ తన కుటుంబానికి పదవులు పంచారని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు దండుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మాటలు నమ్మితే ఆయన మాయలో పడ్డట్టేనని, ఎన్నికల తర్వాత దళిత బంధు రాదని చెప్పారు. ఉద్యమకారులను మోసం చేసిన వ్యక్తికి, తెలంగాణ ప్రజలను మోసం చేయడం ఒక లెక్కనా అని మండిపడ్డారు. కేసీఆర్‌ను గద్దె దింపి యావత్ తెలంగాణను కాపాడుకోవాలని హుజురాబాద్ ప్రజలను కోరారు. ఈటల రాజేందర్ వైపు న్యాయం ఉందని.. కేసీఆర్ పాలన నిజాం పాలనను మించిపోయిందన్నారు. ఈటల రాజేందర్‌‌ను గెలిపించుకుంటే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజయశాంతి కోరారు.

Advertisement

Next Story