- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హరీష్‌కు షాక్ ఇవ్వబోతున్న కేసీఆర్ : విజయశాంతి
దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు రాత్రిబవళ్లు కష్టపడుతున్నారని, కానీ ఎన్నిక అనంతరం సీఎం కేసీఆర్ ఆయనకు షాక్ ఇవ్వబోతున్నారని కాంగ్రెస్ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి అన్నారు. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తై ఫలితాలు వెలువడగానే, తనయుడు కేటీఆర్‌కు సీఎం పదవి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోందని చెప్పుకొచ్చారు.
ఈ వాదనకు బలం చేకూర్చేలా గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి కేసీఆర్ నోట రాజీనామా మాట వచ్చిందని గుర్తుచేశారు. కాషాయ పార్టీ మీద నెపం పెట్టి.. సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ సంకేతాలివ్వడం భవిష్యత్ రాజకీయాలకు అద్దం పడుతోందని విజయశాంతి వ్యాఖ్యానించారు. తనపైన, సర్కారుపైనా నిరాధార ఆరోపణలు చేస్తే విపక్ష నేతల్ని జైలుకు పంపిస్తానని బెదిరించిన కేసీఆర్ ఇప్పుడు సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ.. కొత్త అంశాన్ని ఎందుకు తెరమీదకు తెచ్చారని ఆమె ప్రశ్నించారు.