- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొత్త లోన్లు ఇస్తలే.. రైతును దోపిడి చేస్తున్నరు : విజయశాంతి
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం పనితీరుపై నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా పలు విమర్శలు గుప్పించారు. ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను మరోసారి గుర్తుచేశారు.
‘అధికారంలోకి వస్తే లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తం.. అని ప్రస్తుత గులాబీ పాలకులు గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ నీటి మీద రాతలా మారింది.
ఎన్నికల హామీ అమలు కాలేదు సరికదా.. వడ్లు అమ్ముకుంటే వచ్చిన పైసలను కొంతమంది రైతుల ఖాతాల నుంచి కొత్త లోన్ ఇవ్వకుండా.. పాత లోన్ కింద బ్యాంకు వారు జమ చేసుకున్నారు. పింఛన్, రైతు బంధు డబ్బుల్ని బాకీల కింద జమ చేసుకోవద్దని బ్యాంకులకు సర్కారు నుంచి స్పష్టంగా ఆదేశాలున్నప్పటికీ పట్టించుకునే దిక్కులేదన్నారు.
పంటల సాగు కోసం రైతులు తీసుకున్న రుణాల్ని 5 రోజుల్లో రెన్యువల్ చేయకుంటే చట్టపరమైన చర్యలు తప్పవంటూ, కోర్టు ఖర్చుల్ని కూడా వారే చెల్లించాలని అన్నదాతలకు బ్యాంక్ నుంచి నోటీసులు వస్తున్నాయి. ఇది చాలక బ్యాంకులో క్రాప్ లోన్ ఉందంటూ పించన్లు, రైతు బంధు కూడా అపుతున్నరు.
ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలోని పరిస్థితులివి. ఇక రాష్ట్రం మొత్తం మీద పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. నిలదీసి ఏదైనా అడుగుదమంటే.. చట్టం తెలిసిన వకీళ్ళకే రక్షణ లేకుండా పోయింది. మంథని తీరుగా హత్యలు కాబడుతున్నరు. గుర్రంపోడు లెక్క అన్యాయంపై కొట్లాడుదమంటే అరెస్టులు చేస్తున్నరు, కొట్టి కేసులు పెడుతున్నరన్న భయంతో తెలంగాణ సమాజం ఆందోళన చెందుతోంది’. అని తనదైన శైలిలో రాములమ్మ విరుచుకపడ్డారు.