చిట్టినాయుడి దెబ్బ- అచ్చెన్న అబ్బా: విజయసాయిరెడ్డి ట్వీట్ల వాన

by srinivas |
చిట్టినాయుడి దెబ్బ- అచ్చెన్న అబ్బా: విజయసాయిరెడ్డి ట్వీట్ల వాన
X

దిశ, ఏపీ బ్యూరో: ట్విట్టర్ మాధ్యమంగా టీడీపీపై వైఎస్సార్సీపీ ఎంపీ విమర్శలు, ఛలోక్తులు విసురుతుంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా చోటుచేసుకున్న టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారంపై ఆయన ట్విట్టర్ మాధ్యమంగా.. “చిట్టినాయుడు దెబ్బ-అచ్చెన్న అబ్బా. టీడీపీ అధ్యక్ష పదవికి ఎర్రన్న కుటుంబం పోటీకి వస్తోందని రూ. 900 కోట్ల కుంభకోణంలో కీలక డాక్యుమెంట్లు లీక్ చేసిన చిట్టినాయుడు టీం. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేయించటం, వాటాలు పంచుకోవటం, అడ్డం అని అనుమానం రాగానే లీకులిచ్చి ఇరికించటం. అచ్చెన్న ఎవరెవరు వాటాలు పంచుకున్నారో ఏసీబీకి వెల్లడించాలి” అంటూ ట్వీట్ చేశారు.

అంతకు ముందు వరుస ట్వీట్లలో.. “అరెస్ట్ చేస్తే కిడ్నాపు ఎలా అవుతుంది బాబు గారూ? అచ్చెన్న కుటుంబ సభ్యులు సైతం ఆ మాట అనలేదు. గొడవలు సృష్టించాలనే కుట్రతోనే గదా కిడ్నాప్ అని అరిచారు. అరెస్ట్ ప్రోటోకాల్స్ అన్నిటీనీ ACB పాటించింది. స్కామ్ లో మీ పాత్ర బయటపడతుందనే భయంతోనే బట్టలు చించుకుంటున్నారు.

దిగువ స్థాయి కార్మికులు, వారు పనిచేసే సంస్థలు చెల్లించే కంట్రిబ్యూషన్ తో నడిచే ESI లో రూ. 900 కోట్ల అవినీతికి పాల్పడం సిగ్గు చేటు అనిపించడం లేదా బాబు గారూ. హెరిటేజ్ నెయ్యి కొనుగోలులో లీటరుకు రూ.150 ఎక్కువ వసూలు చేశారు. ప్రజాధనం ఉన్నది దోచుకోవడానికే అన్నట్టు జరిగింది మీ పాలన.

ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికినపుడు ‘మీకు ఏసీబీ ఉంటే నాకూ ఏసీబీ ఉందని’ తెలంగాణా ప్రభుత్వంపై గర్జించావు కదా బాబు గారు. ఇప్పుడు అవినీతి కుంభకోణంలో అచ్చెన్నను అరెస్ట్ చేసేటప్పటికి అది చట్ట విరుద్ధ సంస్థ అయిపోయిందా? అవినీతి మూలాలు కదులుతున్నాయని భయం పట్టుకుందా?” అంటూ ప్రశ్నించారు.

ఇంకో ట్వీట్‌లో టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు నిన్న తనపై చేసిన ట్వీట్‌కు “తక్కువ మాట్లాడం వల్ల ఎప్పుడూ మేలే జరుగుతుంది. అజ్ఞానం బయట పడదు. రామ్మోహన్ నాయుడు కొన్నాళ్లు అలాగే ఉంటే బాగుండేది. కొన్ని కామెంట్లతో తనను తాను ఎక్స్ పోజ్ చేసుకున్నాడు. ఏ రకంగా చూసినా లోకేశ్ బాబుకి సమఉజ్జీనే. డౌటే లేదు. ఆ పార్టీకి కావాల్సింది ఇలాంటి వారే”. అంటూ కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed