‘రఘురామకృష్ణం రాజుపై వేటు వేయాలి’

by  |
‘రఘురామకృష్ణం రాజుపై వేటు వేయాలి’
X

దిశ, వెబ్‌డెస్క్: రఘురామకృష్ణం రాజు స్వపక్షంలో ఉంటూ.. విపక్షంలాగా వ్యవహరించారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాతో సమావేశమయ్యారు. రఘురామకృష్ణం రాజు వ్యవహారంపై దాదాపు 20 నిమిషాల పాటు చర్చించారు. ఆయనపై అనర్హత వేయాలని స్పీకర్‌కు పిటిషన్‌ అందజేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రఘురామ కృష్ణం రాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. స్వపక్షంలో ఉండి విపక్ష నేతలతో మంతనాలు చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై అనర్హత వేయాలని లోక్‌సభ స్పీకర్‌ పిటిషన్‌ అందించామని చెప్పారు.

అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తగు చర్యలు తీసుకుంటామని స్పీకర్ ఓంబిర్లా హామి ఇచ్చారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ అధినేతకు చెప్పుకోవాలన్న విజయసాయిరెడ్డి.. రఘురామకృష్ణం రాజు బహిరంగ విమర్శలకు దిగడం సరికాదన్నారు. ఆయన ప్రజాస్వామ్యాన్ని కూలదోసే విధంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఎన్నికైనా పార్టీపైనే విమర్శలు చేయడం దారుణమన్నారు. పార్టీ అధ్యక్షుడిని అవమానించేలా మాట్లాడారని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు.


Next Story

Most Viewed