- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీడీపీ క్లోజ్..ఆ పార్టీలో ఉన్నోళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులే: విజయసాయిరెడ్డి
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. అధికారాన్ని కోల్పోయి, చావు తప్పి కన్ను లొట్టపోయిన టీడీపీ ఇక ఎప్పటికీ కోలేకోలేదంటూ సెటైర్లు వేశారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజాక్షేత్రంలో టీడీపీకి మనుగడ లేకుండా చేస్తున్నాయన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లోనే కాదు రాష్ట్రంలో ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా.. టీడీపీ ఓడిపోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందంటూ సెటైర్లు వేశారు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ఏకపక్షంగా విజయం కట్టబెట్టారని చెప్పుకొచ్చారు.
ఇక తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేయాల్సిందేనంటూ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇడ్లీలో చట్నీ వేసుకొని తింటూ అలా చెప్పడం ఏంటని పప్పు బాబుకు అప్పుడు అచ్చెన్నాయుడు పార్టీ లేదు బొక్క లేదు అని చేసిన వ్యాఖ్యలపై పొడుచుకొచ్చింది. సీట్లకే కాదు 14 శాతం ఓట్లకు బొక్క పడింది. ఈసారి పప్పు తింటూ పప్పూ లేదు పార్టీ లేదని చెప్పాలేమో అంటూ సెటైర్లు వేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు పార్టీని నెట్టుకువస్తున్నారని విమర్శించారు. టీడీపీలో ఎవరూ లేరని ఉన్నవాళ్లంతా పెయిడ్ ఆర్టిస్ట్ లేనని, ధర్నాలు చేస్తున్న వారంతా కిరాయి మనుషులేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అత్తమీద కోపం దుత్తమీద చూపిస్తే ఎలా?
మరోవైపు మాన్సాస్ ట్రస్టు చైర్మన్, కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజును విజయసాయిరెడ్డి వద్దల్లేదు. అశోక్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాన్సాస్ ఆధీనంలోని 12 విద్యా సంస్థల సిబ్బంది జీతాల సంగతేంటి? అని ప్రశ్నించారు. పదవి కావాలి కానీ బాధ్యతలు పట్టించుకోవా? బోర్డును సమావేశపర్చకుండా ఈ కుట్రలేంటని నిలదీశారు. నిధులు లేక ఉద్యోగుల జీతాలు ఆగిపోయాయి..అలాగే ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే ఎలా? అంటూ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.