- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయసాయి లేఖాస్త్రం.. ఎంపీ రఘురామపై వేటు తప్పదా..?
దిశ, వెబ్‌డెస్క్ : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. రఘురామపై అనర్హత పిటిషన్‌పై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. అనర్హత పిటిషన్ వేసి 11 నెలలు గడిచిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని అనేక సార్లు మిమ్మల్ని కలిశామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడంలో లోక్‌సభ స్పీకర్ కార్యాలయం ఆదర్శంగా ఉండాలన్నారు.
పిటిషన్ పై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం వల్ల నర్సాపురం ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. నర్సాపురం నియోజకవర్గంలో చట్ట బద్ధంగా ఎన్నికైన వ్యక్తి అవసరమని, అర్హత లేని వ్యక్తి పార్లమెంటు సమావేశాలకు హాజరు కావడం అనైతికమని వివరించే ప్రయత్నం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అనర్హత పిటిషన్‌పై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఇప్పటికైనా త్వరగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాను లేఖ ద్వారా విజయసాయిరెడ్డి కోరారు.