పావలా బ్యాచ్‌కి పౌరుషం పొడుచుకొచ్చింది: విజయసాయిరెడ్డి

by srinivas |
పావలా బ్యాచ్‌కి పౌరుషం పొడుచుకొచ్చింది: విజయసాయిరెడ్డి
X

వైఎస్సార్సీపీ, జనసేన మధ్య ట్విట్టర్ పోరు రసకందాయంలో పడింది. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేయడం, దానికి జనసేన నేత నాగబాబు కౌంటర్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. నిన్న పవన్ కల్యాణ్‌పై విజయసాయిరెడ్డి విమర్శలు చేయగానే.. నాగబాబు రంగంలోకి దిగి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలసిందే. తాజాగా మరోసారి అలాంటి విజయ సాయిరెడ్డి.. పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబుపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికి వదిలేసినవాళ్లకు రాజకీయాలెందుకు అంటూ ప్రశ్నించారు. నిన్న నాగబాబు తమ కామన్ ఫ్రెండ్ ద్వారా కలిసి పొత్తుపై చర్చించిన విషయాన్ని గుర్తు చేస్తే.. దానిని ఎత్తి చూపుతూ… 2014లోనే తాము పొత్తులు పెట్టుకోలేదని, పొత్తులుండవని పార్టీ అధినేత జగన్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. చిరంజీవి గారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవని విమర్శించారు. పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చిందంటూ ఎద్దేవా చేశారు.

“చంద్రబాబు కోసం ప్యాకేజి తీసుకుని పుట్టిన పార్టీ అది. రిజిస్టర్ చేసినప్పటి నుంచి ఎవరి కోసం తోక ఊపుతూ మాట్లాడాడో ప్రజలందరికీ తెలుసు. అలాంటి పార్టీతో మేం పొత్తు పెట్టుకుంటామని కలేమైనా కన్నారా? పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల చిత్తుగా ఓడిపోతాడని అందరికీ ముందే తెలుసు” అంటూ ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

tags: vijaya sai reddy, ysrcp, rajya sabha mp, twitter, janasena, pawan kalyan, nagababu



Next Story

Most Viewed