- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విజయ్ శంకర్ అద్భుత హాఫ్ సెంచరీ..
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 40వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. రాజస్థాన్ నిర్దేశించిన పరుగుల ఛేదనలో ఓపెనర్లు చేతులెత్తేసినా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ప్లేయర్లు తమదైన ప్రదర్శనతో మైదానంలో రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన విజయ్ శంకర్ ఇవాళ అద్భుత ఆటతీరును కనబరిచాడు.
మనీష్ పాండేతో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చడంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. వచ్చిన బంతిని వచ్చినట్లే ఆడుతూ.. మధ్యమధ్యలో బౌండరీలకు మలుస్తున్నాడు. ఈ క్రమంలోనే జోఫ్రాఅర్చర్ బౌలింగ్‌లో హాట్రిక్ ఫోర్లు బాదిన విజయ్ శంకర్ 52(51) సులువుగా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
Next Story