ఇంట్రెస్టింగ్‌గా సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ ఫస్ట్ లుక్!

by  |
ఇంట్రెస్టింగ్‌గా సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ ఫస్ట్ లుక్!
X

మోస్ట్ అవేయిటెడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మూవీ.. ‘తుగ్లక్ దర్బార్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది. మిర్రర్ ఇమేజ్‌లో ఉన్న సేతుపతి ఒక పిక్‌లో బుర్ర నిండా ఆలోచనలు పరిగెడుతుంటే, మరో పిక్‌లో పైకి మాత్రం నవ్వుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ రాజకీయ నాయకుడిగా కనిపిస్తుండగా, ఫస్ట్ లుక్ సూపర్ ఇంట్రెస్టింగ్‌గా ఉందని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.

ఢిల్లీ ప్రసాద్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో.. అదితి రావు హైదరీ ఫిమేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఢిల్లీ ప్రసాద్‌కు డైరెక్టర్‌గా ఇది తొలి సినిమా కాగా.. ‘96’ లాంటి హిట్ చిత్రాలకు అతడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సినిమాలో పార్థీబన్, కరుణాకరన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక బాలాజీ దరణీధరన్ డైలాగ్ రైటర్ కాగా.. గోవింద్ వసంత మ్యూజిక్ సమకూరుస్తున్నారు.


Next Story

Most Viewed