విజయ్‌తో నటించేందుకు నర్వస్‌గా ఫీల్ అయ్యా : సేతుపతి

by Shyam |
విజయ్‌తో నటించేందుకు నర్వస్‌గా ఫీల్ అయ్యా : సేతుపతి
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ సేతుపతి ఏ సినిమాలో ఉంటే.. ఆ సినిమాలో పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. తను కమిట్ అయ్యే ప్రాజెక్ట్‌లు, ఎంచుకునే క్యారెక్టర్స్ అలా ఉంటాయి. హీరో లేదా విలన్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్.. పాత్ర ఏదైనా సరే పవర్‌ఫుల్‌గా, ప్రేక్షకులపై ముద్రవేయగలిగేలా ఉంటే కమిట్ అయిపోతాడు. ఈ క్రమంలో ఇళయ దళపతి విజయ్‌తో కలిసి మల్టీస్టారర్ మూవీ ‘మాస్టర్’ చేశాడు సేతుపతి.

జనవరి 13న రిలీజై సూపర్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం గురించి తాజాగా మాట్లాడిన ఆయన.. సినిమా థియేటర్స్‌లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కావడం సంతోషంగా ఉందని తెలిపాడు. సినిమా హాల్స్‌లో మూవీ చూడలేని ప్రేక్షకుల కోసమే త్వరగా ఓటీటీలో చిత్రాన్ని విడుదల చేసినట్లు తెలిపాడు సేతుపతి. ప్రేక్షకులకు ఎలాగైనా సినిమా రీచ్ కావాలనేదే మేకర్స్ ఉద్దేశం అని చెప్పాడు. ఇక విజయ్‌తో ఫస్ట్ టైం మాస్టర్ ద్వారా స్క్రీన్ షేర్ చేసుకున్న సేతుపతి.. తనతో నటించేందుకు ముందు చాలా నర్వస్ ఫీల్ అయినట్లు తెలిపాడు. ఆ తర్వాత కంఫర్ట్‌గా ఫీల్ అయ్యానని చెప్పాడు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ కాగా, అర్జున్ దాస్ ఓ కీలక పాత్ర పోషించాడు.

Advertisement

Next Story