‘పుష్ప’తో అదే సమస్య : సేతుపతి

by  |
‘పుష్ప’తో అదే సమస్య : సేతుపతి
X

తమిళ నటుడు విజయ్ సేతుపతి యాక్టింగ్‌కు తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు ఇండియన్ సినీఇండస్ట్రీ మొత్తం ఫిదా అయింది. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’లో చిన్నపాటి పాత్రే చేసినా నేచురల్ యాక్టింగ్‌తో తెలుగు అభిమానులను మెస్మరైజ్ చేశాడు విజయ్. తర్వాత ‘ఉప్పెన’ సినిమాలో విలన్‌గా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న సేతుపతి.. పుష్ప సినిమాలోనూ నటిస్తున్నట్లు ప్రకటించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో సేతుపతి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే ఇందుకు కారణమని టాక్ వినిపించింది. కానీ అసలు విషయం ఇదంటూ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు సేతుపతి.

పుష్ప సినిమా చేయడం లేదనే వార్త నిజమేనన్న విజయ్.. డైరెక్టర్ సుకుమార్‌ను వ్యక్తిగతంగా కలిసి వివరణ ఇచ్చినట్లు తెలిపాడు. కాల్ షీట్స్ సమస్య వల్లే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెప్పాడు. ఈ సమస్య వల్ల మూవీ షూటింగ్‌లో ఇబ్బందులు రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అందుకే సినిమా చిత్రీకరణ ప్రారంభం కాకముందే ఈ విషయాన్ని దర్శకుడికి చెప్పినట్లు వివరించాడు సేతుపతి.


Next Story