చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి

by srinivas |
చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి
X

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు కరోనా భయంతో ఇళ్లకు పరిమితమయ్యారు. ప్రభుత్వం కరోనా కేసులను ఎలా కొలిక్కి తేవాలా? అన్న ప్రణాళికల్లో మునిగిపోయింది. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం విపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై బిజీగా మారారు. గత రెండు రోజులు జనసేనపై విమర్శలు చేసిన విజయసాయి టీడీపీపై విమర్శనాబాణాలు ఎక్కుపెట్టారు.

ప్రధానితో మాట్లాడాలని అనుకుంటున్నానని పీఎంఓ కార్యాలయానికి కాల్ చేసి చెబితే, ఆ వెంటనే ప్రధాని తనకు ఫోన్ చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ట్విట్టర్ మాధ్యమంగా బాబుపై విమర్శలు చేస్తూ… ప్రధానితో మాట్లాడుతానని ఓ పాతికసార్లు పీఎంవో అధికారులను బాబు ప్రాధేయపడివుంటారని, అందుకే మోదీ కాల్ చేసి ఉండవచ్చని అన్నారు. ప్రధాని మోదీ పారిశుద్ధ్య కార్మికులతో, నర్సింగ్ సిస్టర్లతో, కరోనా నుంచి కోలుకున్న వారితో కూడా మాట్లాడారని గుర్తుచేశారు. ప్రధాని నిత్యం ఎంతో మందికి ఫోన్లు చేసి పరామర్శించి, ప్రశంసిస్తారని, అది ఆయన వినమ్రత అని తెలిపారు.

బాబు పాతికసార్లు ప్రాధేయ పడితే కాల్ చేసి ఉంటారు. దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటే నవ్వొస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. అయినా బాబు ఏ మొహం పెట్టుకుని ఏపికి వస్తాడు? అని ప్రశ్నించారు. మోదీ గో బ్యాక్ అని ఫ్లెక్సీలు కట్టించిన విషయం ప్రజలిప్పటికీ గుర్తుపెట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. వ్యక్తిగత విషయాలపై నీచంగా ఆరోపణలు చేసిన సంగతి మోదీగారు మర్చిపోయుంటాడని బాబు అనుకుంటున్నాడని అన్నారు. మోదీది అపార జ్ఞాపకశక్తి అని పొగుడుతూ, అయినా ప్రజలు తిరస్కరించిన వాడిని ఎవరూ ఆదరించరు. అంటూ విమర్శించారు.

tags: andhra pradesh, tdp, ysrcp, chandrababu, vijayasai reddy

Advertisement

Next Story