- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మరిచిపోలేని జ్ఞాపకం: విజయ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకున్నారు. ‘మిడిల్ క్లాస్ ఫండ్’ ద్వారా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు సరుకులు అందించి వారి ఆకలిబాధను తీర్చారు. ప్రస్తుతం ప్రభుత్వం లాక్‌డౌన్‌కు సడలింపులు ఇస్తుండగా.. మిడిల్ క్లాస్ ఫండ్ ఫైనల్ రిపోర్ట్‌ను విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ లాక్‌డౌన్ కాలం మనందరికీ చాలా జ్ఞాపకాలను మిగిల్చిందన్న విజయ్.. ‘కరోనా అనేది వింత సంఘటన.. మనల్ని భయపెడుతూ ఇంటి పట్టునే ఉంచిన మహమ్మారి.. మనల్ని హ్యాండ్ షేక్, హగ్గింగ్ నుంచి దూరంగా పెట్టిన భయంకర వ్యాధి’ అన్నారు. ఈ కాలంలో దగ్గు అనేది ఒక పెద్ద బాంబులా అనిపించిందన్న రౌడీ హీరో.. ‘ఈ కరోనా టైమ్ అపరిచితులను దగ్గరకు చేర్చి కొందరికి బాధతో కూడిన జ్ఞాపకాలను మిగిల్చితే.. మరికొందరికి భవిష్యత్‌లో మధుర స్మృతులుగా షేర్ చేసుకునే మెమొరీస్‌ను’ ఇచ్చిందన్నారు.
36 రోజుల్లో 8,515 మంది గొప్ప హృదయమున్న దాతలు, 535 మంది వాలంటీర్లు రౌడీలు కలిసి మిడిల్ క్లాస్ ఫండ్ అనే గొప్ప జ్ఞాపకాన్ని అందించారన్న విజయ్.. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మిడిలి క్లాస్ ఫండ్ అనేది ఆపదకాలంలో తప్పకుండా చేయూతనిచ్చే జీవితకాలపు సపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పారు. ఈ కాలాన్ని.. ఈ జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపారు.