- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నయన్‌తో సేతుపతి రొమాన్స్.. ఫీల్ అవుతున్న బాయ్‌ఫ్రెండ్

దిశ, సినిమా : మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నయనతార, సమంత అక్కినేని ప్రధానపాత్రల్లో నటిస్తున్న కోలీవుడ్ చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’. నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు సంబంధించి మేజర్ పోస్టర్ రిలీజైంది. ఈ సందర్భంగా స్పెషల్ పోస్ట్ పెట్టిన శివన్.. నయన్ మరో హీరోతో జతకడుతుందంటే ఫస్ట్ టైమ్ పోసెసివ్‌గా ఫీల్ అవుతున్నట్లు తెలిపాడు. అయితే ఈ పోస్ట్‌తో నయన్, సేతుపతి కెమిస్ట్రీ మరోసారి బ్లాక్ బస్టర్ కానుందని తెలుస్తుండగా.. సమంత గురించి కూడా ప్రస్తావించాడు శివన్. సామ్ ఓ అద్భుతమని అభివర్ణించిన డైరెక్టర్.. ఈ పార్టీలో తను కూడా జాయిన్ కావడంపై ఆనందంగా ఉందన్నాడు. ఈ ప్రాజెక్ట్ జర్నీలో అమేజింగ్, మెమొరబుల్ మూమెంట్స్ మాత్రమే ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా శివన్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా లవ్ అండ్ రొమాంటిక్ జోనర్‌లో రానున్న సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.