రైతు అవతారమెత్తిన విద్యావాలంటీర్

by  |
రైతు అవతారమెత్తిన విద్యావాలంటీర్
X

దిశ, సంగారెడ్డి: లాక్ డౌన్ నేపథ్యంలో స్కూళ్లు ఇప్పట్లో ప్రారంభమయ్యేలా లేవని నిశ్చయించుకున్న ఓ విద్యావాలంటీర్ రైతు అవతారమెత్తాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. బతుకు బండి నడవటం కష్టంగా మారిన తరుణంలో రైతుగా మారినట్టు ఆయన చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే..సంగారెడ్డి జిల్లా మైనెలి గ్రామానికి చెందిన మెత్రి జైపాల్ విద్యా వాలంటీర్‌గా పనిచేసే వారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా పాఠశాలలన్నీ మూసివేసే ఉన్నాయి. కనీసం ఎప్పుడు ప్రారంభమవుతాయో అన్న సందిగ్ధం కూడా తొలగడం లేదు. దీంతో రైతుగా మారి తనకున్న వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రయివేటు లెక్చరర్లు, ఉపాధ్యాయులకు మేనేజ్మెంట్లు వేతనాలు చెల్లించకపోవడంతో తమంతా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని..ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు.


Next Story