మహేశ్‌కు సోదరిగా విద్య?

by  |
మహేశ్‌కు సోదరిగా విద్య?
X

దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ విద్యాబాలన్.. హీరోయిజంతో సంబంధం లేకుండా ఒంటి చేత్తో బాక్సాఫీస్ వద్ద సినిమాను సూపర్ సక్సెస్ చేయగలదు. ‘డర్టీ పిక్చర్, తుమ్హారి సులు, శకుంతలా దేవి’ సినిమాలు ఇందుకు పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ కాగా.. పాత్రలో ఇట్టే జీవించి పోయే విద్య సౌత్‌లోనూ నటించింది.

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’లో బసవతారకం పాత్రకు సజీవ రూపం ఇచ్చి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విద్యా బాలన్.. మరోసారి తెలుగు తెరపై కనిపించబోతుందని ఫిల్మ్ నగర్ టాక్. సూపర్ స్టార్ మహేశ్ బాబు మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘సర్కార్ వారి పాట’లో విద్య తనదైన మార్క్ చూపించబోతుందని తెలుస్తోంది. కంటెంట్ పవర్ ఫుల్‌గా ఉండాలే గానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అయినా ఓకే చెప్పే విద్య.. ఇప్పుడు మహేశ్‌కు అక్కగా నటించబోతుంది. సర్కార్ వారి పాట దర్శక, నిర్మాతలు ఇప్పటికే తనను సంప్రదించగా.. ఈ డర్టీ పిక్చర్ హీరోయిన్ ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అని తెలుస్తోంది.

కాగా, పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, జీఎంబి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మహేశ్‌కు విలన్‌గా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కానున్నారని ఇప్పటికే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.


Next Story