ఇందిరాగాంధీ బయోపిక్‌లో విద్య

by  |
ఇందిరాగాంధీ బయోపిక్‌లో విద్య
X

బాలీవుడ్ అందాల భామ విద్యా‌బాలన్ ఏ సినిమా చేసినా సరే మినినమ్ గ్యారంటీ అనే మార్క్ పడిపోయింది. ది డర్టీ పిక్చర్ మూవీతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది నేషన్ అయిపోయిన ఈ భామ.. ఈ చిత్రంలో ఐటెం గర్ల్ సిల్క్ స్మిత పాత్రలో సూపర్ హాట్‌గా కనిపించి మెప్పించింది. ఆ తర్వాత విద్య ఏ సినిమా చేసినా సరే..సూపర్ సక్సెస్ అవుతుంది. దీంతో ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని అనుకున్న దర్శక, నిర్మాతలకు ఫస్ట్ చాయిస్ అయిపోయింది విద్య.

ముఖ్యంగా బయోపిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోతుంది. ఒకరి క్యారెక్టర్‌లో ఇట్టే జీవించిపోయే విద్యకు అలాంటి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న శకుంతలా దేవి సినిమాతో మరోసారి మెప్పించిన విద్యకు.. మరో క్రేజీ క్యారెక్టర్‌లో జీవించే చాన్స్ వచ్చింది. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్ ఆధారంగా తెరకెక్కే చిత్రంలో ఇందిరా పాత్రలో నటించనుందని సమాచారం. ఈ చిత్రాన్ని తన భర్త సిద్ధార్థ రాయ్ కపూర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కాగా, తెలుగులో బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది విద్య.


Next Story