- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా చిన్నగా స్మైలిస్తారు... అంతేకాదు...
దిశ, వెబ్ డెస్క్: తోబుట్టువుల మధ్య స్వచ్ఛమైన, మార్పులేని ప్రేమను చూపించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్స్ ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేవిధంగా తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... ఓ వ్యక్తి ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఓ చిన్నారి తన చెల్లి, తమ్ముడితో నిర్మాణ స్థలంలో ఉంది. అయితే, ఆ సమయంలో వారున్న మార్గం గుండా ఓ భారీ వాహనం అటు వైపుగా వెళ్లబోయింది. ఈ క్రమంలో ఆ వాహనాన్ని గమనించిన ఆ చిన్నారి వెంటనే అక్కడి చేరుకుని, తన చేతులతో ఆగు ఆగు ఇక్కడ మా తమ్ముడు, చెల్లి ఉన్నారు అంటూ రోడ్డుకు మధ్యలో నిలబడుతుంది. ఆమెను గమనించిన వాహనదారుడు ఆ వాహనాన్ని వెంటనే ఆపేస్తాడు. ఆ వెంటనే ఆ చిన్నారి తన చెల్లిని, తమ్ముడిని ఇంట్లోకి పంపించి, ఆమె కూడా ఇంట్లోకి వెళ్తుంది. ఆ తర్వాత ఆ వాహనం కూడా అటు నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.