- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యను నగ్నంగా ఊరేగించిన భర్త.. అనంతరం ఆమెపై ఎక్కి..
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ లో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పరాయి పురుషుడితో పారిపోయిన భార్యను వెతికి పట్టుకున్న భర్త.. అమానుషానికి పాల్పడ్డాడు. గ్రామ పెద్దలతో కలిసి ఆమెను నగ్నంగా గ్రామంలో ఊరేగించాడు. అంతేకాకుండా ఆమె భుజాలపై ఎక్కి ఊరేగాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
వివరాలలోకి వెళితే.. దహోడ్ జిల్లాలో ఓ గిరిజన ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(26), భార్య (23)తో కలిసి నివాసముంటున్నాడు. ఈ క్రమంలో గతనెల అతని భార్య, వేరొక వ్యక్తి మోజులో పడి అతడితో పారిపోయింది. దీంతో ఆమె భర్త, గ్రామస్థులు కలిసి వారి ఆచూకీని గుర్తించి, గ్రామానికి తీసుకొచ్చారు. ఈ విషయమై జూలై 6న పంచాయితీ పెట్టారు. వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా అతడితో పారిపోయిందని ఆమెను భర్త, కుటుంబ సభ్యులు కలిసి ఇష్టంవచ్చినట్లు కొట్టారు. అంతటితో ఆగకుండా ఆమెను వివస్త్రను చేసి ఊరేగించారు. నగ్నంగా పరిగెత్తాలని హింసించారు. ఆ తర్వాత చేసిన తప్పుకు గాను తన భర్తను భుజాన ఎత్తుకొని నడవాలని గ్రామ పెద్దలు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఈ ఘటన పై కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్తతో పాటు మరో 18 మందిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.