బేర్ గ్రిల్స్‌తో విక్కీ కౌశల్.. అందుకే ఈ ప్రిపరేషన్!

by Shyam |
Vicky Kaushal
X

దిశ, సినిమా : పాపులర్ బ్రిటిష్ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్ ‘ఇన్‌ టు ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ న్యూ సీజన్ స్టార్ట్ చేశాడు. ఇందుకోసం బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్‌తో ఇప్పటికే ఓ ఎపిసోడ్ చేసిన ఆయన.. నెక్స్ట్ ఎపిసోడ్‌ను యంగ్ హీరో విక్కీ కౌశల్‌తో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే మాల్దీవ్స్‌లో షూటింగ్ స్టార్ట్ కానుండగా.. డిస్కవరీస్ పాపులర్ సర్వైవర్ షోలో తనను తాను పరీక్షించుకోనున్నాడు. ప్రస్తుతం మూవీ షూటింగ్స్‌తో బిజీగా ఉన్న విక్కీ.. మరికొద్ది రోజుల్లో మాల్దీవ్స్‌కు వెళ్లనున్నాడు. ప్రస్తుతం సర్దార్ ఉదమ్ సింగ్ మూవీ ప్రిపరేషన్‌లో బిజీగా ఉన్న విక్కీ.. మేక్ ఓవర్‌ పిక్స్‌తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.


Advertisement
Next Story

Most Viewed