కనుల పండువగా స్వామి వారి కళ్యాణం

by Sridhar Babu |
Matyasgiri Temple
X

దిశ, భువనగిరి రూరల్ : రెండో యాదాద్రిగా పేరొందిన మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వలిగొండ మండలం వెంకటాపురంలో ఉన్న ఈ దేవాలయంలో గురువారం హోమం, బలిహరణం నిర్వహించారు. అనంతరం వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా చేశారు.

Venkateswara Swamy Temple

ఈ కార్యక్రమం యాజ్ఞ్యచార్య ప్రతాపురం మత్స్యగిరి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఆలయ ఈవో కె.రవి కుమార్, ఆలయ ధర్మకర్తల కమిటీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి, ధర్మకర్తలు, ఎంపీపీ నూతి రమేష్ రాజ్, వేములకొండ ఎంపీటీసీ సామ రామరెడ్డి, వెంకటాపురం సర్పంచ్ కొత్త నరసింహ, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed