కరోనా ఇప్పటికీ ముప్పే.. జాగ్రత్త : వెంకీ

దిశ, వెబ్‌డెస్క్: విక్టరీ వెంకటేశ్ అభిమానులకు జాగ్రత్తలు వివరించారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సాధారణమయ్యే వరకు ప్రతీ ఒక్కరు కూడా మాస్క్‌లు ధరించాలని కోరారు. క్రమం తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని.. శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తూ, సామాజిక దూరం పాటించాలని అభ్యర్థించారు. ఇప్పటికీ వైరస్ ప్రభావం అధికంగానే ఉందన్న వెంకీ.. కరోనా పెద్ద ముప్పుగా పరిణమించిందని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు.

ప్రస్తుతం ‘నారప్ప’ సినిమా కమిట్ అయిన వెంకీ.. తర్వాత ఎఫ్3 మూవీ సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్‌లో ఉన్నారు. కానీ కరోనా కారణంగా నిలిచిపోయిన నారప్ప షూటింగ్ పున:ప్రారంభం కావాల్సి ఉంది. ఇక బొబ్బిలిరాజా సినిమా విడుదలై 30 ఏళ్లు అయిన సందర్భంగా అందుకు సంబంధించిన జ్ఞాపకాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు వెంకీ మామ. కమల్ హాసన్ ఫస్ట్ క్లాప్ ఇవ్వడం.. దివ్య భారతితో అడవిలో షూటింగ్ విశేషాలను గుర్తు చేసుకున్నారు.

Advertisement