- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ముగ్గురు ప్రజాప్రతినిధులు సస్పెన్షన్
by Shyam |

X
దిశ, వరంగల్: ఆ ముగ్గురు గ్రామ ప్రజాప్రతినిధులు. వారు నిధులు దుర్వినియోగం చేసినట్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో కలెక్టర్ వారిపై విచారణ జరిపారు. గ్రామ సభ తీర్మాణాలు, ఎంబీలు లేకుండానే నిధులు డ్రా చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఈ వ్యవహారంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సదరు నేతలకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఆ నేతలు ఇచ్చిన వివరణతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకీ ఆ నేతలు ఎవరో తెలసుకుందాం. ములుగు జిల్లా వెంకటాపురం మండల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు. వీరు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడికావడంతో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Next Story