- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిటకిటలాడిన రాజన్న సన్నిధి.. కోడె మొక్కులతో కొత్త జంటల సందడి
దిశ, వేములవాడ : కరోనా కారణంగా 40 రోజులుగా వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తజన సందోహం పెద్దగా కనిపించలేదు. కరోనా కేసులు అదుపులోకి రావడంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నేపథ్యంలోనే రాజన్న సన్నిధికి భక్తులు క్యూ కట్టారు. పైగా సోమవారం కావడంతో రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు.
సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు మొదట కోడె మొక్కులు చెల్లించుకుని, స్వామి వారిని దర్శించుకున్నారు. కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొద్ది రోజులుగా ఆలయం మూసి ఉండడంతో భక్తులు లేక రాజన్న సన్నిధి వెలవెలపోయింది. ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణంతో పాటు పట్టణంలో చుట్టుపక్కల భక్తుల సందడి నెలకొంది. కాగా, కొవిడ్ నిబంధనల మేరకే భక్తులను స్వామివారి దర్శనం కోసం ఆలయ అధికారులు అనుమతిస్తున్నారు.