టీఆర్ఎస్‌ వైపే… ఆ ముంపు గ్రామాలు

by Shyam |   ( Updated:2020-10-03 02:46:10.0  )
టీఆర్ఎస్‌ వైపే… ఆ ముంపు గ్రామాలు
X

దిశ, సిద్దిపేట: మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన వేములఘాట్ ఎంపీటీసీ ఘణపురం కల్పన శనివారం ఉదయం మంత్రి హరీశ్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, టీఆర్ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుపై నమ్మకంతో తమ గ్రామ ఓట్లన్నీ టీఆర్ఎస్ పార్టీకే వేయిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… పనిచేసే టీఆర్ఎస్ ప్రభుత్వానికి జై కొడుతూ ముంపు గ్రామాలు బ్రహ్మరథం పడుతున్నాయని చెప్పారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్ తెచ్చిన చట్టానికి రైతులు పాలాభిషేకం చేస్తే, రైతుల నడ్డి విరిచే చట్టం తెచ్చిన కేంద్ర ప్రభుత్వంపై నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. ముంపు గ్రామ ప్రజల పట్ల సానుభూతితో సీఎం కేసీఆర్ పాజిటివ్‌గా ఉన్నారని అన్నారు. గజ్వేల్ కొండపోచమ్మ సాగర్ ముంపు బాధితులతో ఏ విధంగా ఉన్నారో.. మల్లన్న సాగర్ ముంపు బాధితులతో అదే తరహాలో ఉంటారన్నారు. ముందు వరుసలో పల్లె పహాడ్, వేములఘాట్ గ్రామాలు ఆ రోజు మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం భూములిచ్చి ముందు కొచ్చినట్టుగానే ఇవాళ కూడా ముందు వరుసలో నిలబడి అందరికీ మార్గదర్శకంగా నిలబడ్డాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed