తిరుమలలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన వెల్లంపల్లి 

by srinivas |
తిరుమలలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన వెల్లంపల్లి 
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్ మోహన్ రెడ్డిని, ఈ ప్రభుత్వాన్ని… ఒక మతానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా ధ్వజమెత్తారు. శుక్రవారం తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

హైద్రాబాద్ లో చంద్రబాబు, ఢిల్లీలో కూర్చొని రఘురామ కృష్ణంరాజు హిందూ మతం పై సవతి ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. గణేష్ ఉత్సవాలపై నిర్ణయం తీసుకునే ముందు ఇతర రాజకీయ పక్షాలతో, స్వామిజీలతో సంప్రదించినట్టు తెలిపారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఇళ్లలోనే వినాయకుడి పూజలు చేసుకోవాలని ప్రజలకు సూచించినట్టు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసానికి సంబంధించిన ఇలాంటి సున్నితమైన అంశాలపై రఘురామ కృష్ణం రాజు మాట్లాడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.

ఢిల్లీ నుంచి నియోజకవర్గానికి రాకుండా విమర్శలు చేయడం తగదన్నారు. రఘురామ కృష్ణంరాజుకు వార్నింగ్ ఇస్తున్న హిందూ మతంపై అంత నమ్మకముంటే ముందు తన నియోజకవర్గానికి వచ్చి వినాయక చవితి పూజలు నిర్వహించాలన్నారు. ‘చంద్రబాబు మార్గ నిర్దేశనంతో పనిచేస్తున్నావ్.. నువ్వు ఒక పనికిమాలిన రాజకీయ నాయకుడివి’ అంటూ తీవ్ర పదజాలంతో మంత్రి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story